About ACF10 News

ACF 10 TV లక్ష్యం అవినీతిపై నిరంతరం పోరాటం చేయడం, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావడం. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడటమే మా ధ్యేయం. ఏ రాజకీయ పార్టీకి, నాయకుడికి లేదా వారి ప్రలోభాలకు లోబడకుండా నిష్పాక్షికంగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం మా బాధ్యత. తప్పు చేసిన వారు ఎంత పెద్ద అధికారులు అయినా, ఎంతటి రాజకీయ నాయకులు అయినా, చట్టాన్ని ఉల్లంఘించి తప్పు చేస్తే వారిని నిర్భయంగా ప్రశ్నించి, ప్రజల ముందు నిజాలను వెలుగులోకి తీసుకురావడం మా కర్తవ్యం. ప్రజల గొంతుకగా, ప్రజా సమస్యలకు అండగా నిలుస్తూ, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయడమే ACF 10 TV యొక్క ప్రధాన లక్ష్యం. మా ఛానల్‌కు అవసరమైన బ్రాడ్‌కాస్టింగ్ మరియు సంబంధిత ప్రభుత్వ అనుమతులు ఉండటంతో ప్రజలకు నమ్మకమైన, నిష్పాక్షికమైన వార్తలను అందిస్తున్నాము.